Wednesday, November 13, 2024

RGV: ఆర్జీవీకి నోటీసులిచ్చిన ఒంగోలు పోలీసులు

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయల్దేరి వచ్చిన పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో.. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంతో పాటు.. జనసేన అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారని ఒంగోలులో కేసు నమోదైంది.

ఒంగోలు జిల్లా మద్దిపాడు స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఎస్సై శివరామయ్య కేసు నమోదు చేసి.. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి డైరెక్ట్ గా నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement