Wednesday, January 1, 2025

Ongole – గాలిలోకి ఎగిరి ఆటో పై పడిన కారు – మహిళ దుర్మరణం

ఒంగోలు క్రైం, (ఆంధ్రప్రభ): ఒంగోలులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా , ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పి డివైడర్ను ఢీ కొన్న కారు గాల్లోకి ఎగిరి ముందు ప్రయాణిస్తున్న ఆటో పై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరు వెంకటాయపాలెం కి చెందిన లేక్కే పద్మ(40), ఆమె కుమార్తెలు లక్ష్మి, మాధవి బొంతలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఒంగోలు వచ్చేందుకు టంగుటూరు ఆటో స్టాండ్ వద్ద సర్వీస్ ఆటోను ఎక్కారు.

వీరితో పాటు ఆటోలో టంగుటూరు కు చెందిన రమేష్, విజయమ్మ, బాలకోటేశ్వరరావు, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న చీమకుర్తికి చెందిన మునివర పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో పెళ్లూరు జాతీయ రహదారిపై గల ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో ఏపీ 39 ఎల్ యు 9949 నెంబర్ గల కారు నెల్లూరు వైపు నుండి విజయవాడ వైపు వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో గాల్లోకి ఎగిరిన కారు ముందు ప్రయాణిస్తున్న ఆటో పై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అందరూ కింద పడగా పద్మపై కారు పడి పద్మ అక్కడికక్కడే దుర్మరణం పాలయింది.

- Advertisement -

ప్రమాదం చోటు చేసుకోగానే కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడ నుండి పరారయ్యారు. ఇక మరణించిన కుమార్తెలు ఇద్దరితో పాటు మరో ఆరుగురు తీవ్ర, స్వల్ప గాయాలు పాలు కావడంతో చికిత్స నిమిత్తం వీరిని ఒంగోలు జి జి హెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement