ఒంగోలు జాతి గిత్తలకు ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఒంగోలు జాతి గిత్తలు సేద్యానికి.. ఆవులు అధికపాల దిగుబడికి ప్రసిద్ధిగాంచాయి. బరువులు మోయడంలో ఏ జాతి పశువులు పోటీపడలేవు. తాజాగా గుంటూరు జిల్లాలో 20 నెలల వయస్సున్న ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు పలికింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు, చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు నుంచి ఓ ప్రైవేట్ బ్రీడింగ్ కేంద్రం వారు ఈ కోడెను రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. బ్రీడింగ్ నిమిత్తం ప్రత్యేకంగా దీన్ని కొనుగోలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..