అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వంటనూనెల ధరల నియంత్రణ, కల్తీ విక్రయాలు నియంత్రించేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. విజిలెన్స్ డీజీ శంకభ్రత బాగ్చి ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హోల్‌సేల్, రిటైల్ షాపులతోపాటు నూనె తయారీ కేంద్రాలు, గోడౌన్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విెజయవాడ, కడప, తిరుపతి, ఏలూరు, కర్నూలు తదితర చోట్ల మొత్తం 181 తనిఖీలు నిర్వహించి తూనికలు, కొలతలు చట్టం కింద నిబంధనలు పాటించనివారిపై 21కేసులు నమోదు చేశారు.
అదేవిధంగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై 4కేసులు నమోదు చేశారు. నూనెలు అధిక ధరలకు విక్రయించినా, కల్తీ, అధిక నిల్వలకు సంబంధించి గుర్తించినా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..