Tuesday, November 26, 2024

జిల్లాలో ఎడతెరిపి లేని వానలు..

అనంతపురం, ప్రభ న్యూస్: జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తునే ఉన్నాయి. ఫలితంగా పాత మిద్దెల్లో నివాసం ఉన్న వారు అవి కూలడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ స్థానిక పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల దాకా పాత మిద్దెలు ఈ వర్షాలకు ధ్వంసమయ్యాయి. ఉండేందుకు నిలువ నీడ లేక చాలా మంది బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో సాగైన వివిధ రకాల పంటలు 20 వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

బాధిత రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కల్లాళ్లో దాన్యం వర్షాల్లో నానిపోయి, వాటిని ఎండబెట్టుకునేందుకు అవకాశం లేక అవి మొలకలు వచ్చి దేనికీ పనికి రాకుండా పోయాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు పరిశీలిస్తే మొత్తం 41 మండలాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకదాటిగా కదిరి 10 మండలాల్లో వర్షాలు పడడంతో ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement