కర్నూలు ఉమ్మడి జిల్లా బ్యూరో : శ్రీశైల జలాశయానికి తుంగభద్ర, కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు అందిన సమాచారం మేరకు శ్రీశైల జలాశయంకు 3,62,455 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. ఇక జలాశయం నుంచి 3,44,218 క్యూసెక్కుల నీరు దిగుకు విడుదలవుతుంది.
ఇందులో ఏపీకి చెందిన కుడి విద్యుత్ కేంద్రం నుంచి 26,016 క్యూసెక్కుల నీటిని వినియోగించి 13.145 మెగావాట్లు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 17.014 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దిగువ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలోని మల్యాల ప్రాజెక్టుకు 1150, పోతిరెడ్డిపాడు 25000, తెలంగాణలోని కల్వకుర్తికి 2400 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదలవుతుంది. ఇక శ్రీశైల డ్యాం కు చెందిన 10 గేట్లను 12 అడుగుల మేర పైకి ఎత్తి 3,10,840c క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ విడుదల చేస్తున్నారు.
మొత్తంగా శ్రీశైల జలాశయం నుంచి స్పిల్ వే, విద్యుత్ ఉత్పత్తి, కాలువల ద్వారా 4,61,519 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులకు గాను, 883 అడుగులుగా ఉంది. 215 టీఎంసీల నీటి నిల్వలకు గాను 204 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ ఉంచారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 2,31,696, విద్యుత్ కేంద్రం నుంచి 22,223,సుంకేసుల నుంచి 1,07,536 క్యూసెక్కుల చొప్పున మొత్తం 3,46,410 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండడం విశేషం.