Tuesday, November 26, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటలు..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమల బాటపట్టారు. ఈ రద్దీ నేపథ్యంలో కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ ఆంక్షలను సడలించిన టిటిడి భక్తులను ఎప్పటికప్పుడు కంపార్టు మెంట్లలోకి అనుమతించి శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. కాగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అధికారులు క్యూ లైన్‌లను పరిశీలీస్తు త్వరిత గతిన క్యూ లైన్‌లు కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే క్యూ లైన్‌లలో, కంపార్టు మెంట్లలో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు అన్నప్రసాదాలు, తాగునీరు వంటివి శ్రీవారి సేవకుల సహాయం ద్వారా నిరంతరాయంగా అందచేస్తున్నారు. కాగా బుధవారం రోజు 88,748 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌ ద్వారా 46,400 మంది, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 25,819 మంది, వర్చువల్‌ సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపుల ద్వారా 16,529 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఈ రద్దీ సోమవారానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement