Monday, January 6, 2025

KNL | ఎస్సీ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ వినితుల స్వీకరణ

  • కర్నూల్ లో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు
  • మూడంచెల భద్రత మధ్య లోనికి అనుమతి


కర్నూల్ బ్యూరో : షెడ్యూల్డ్ కులముల ఉపవర్గీకరణపై ప్రజలు, వివిధ కుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు, వినితుల స్వీకరణలో భాగంగా గురువారం కర్నూల్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మాన్ కమిటీ.. సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూల్ కలెక్టరేట్ కి వివిధ షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుల సంఘం నాయకులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత మధ్య టోకెన్లు ఇచ్చిన వారిని మాత్రమే కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలోకి అనుమతించారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏబీసీడీలు చేయాలా వద్దా.. చేస్తే ఎవరికి ఎంత పర్సంటేజీ.. అన్న అంశంపై ప్రధానంగా వినతులను ఆయా కుల సంఘాల నుంచి తీసుకోవడం జరిగింది.

కుల సంఘం నేతల అభిప్రాయాలు..
వన్ మ్యాన్ కమిషన్ కాకుండా, త్రీ మ్యాన్ కమిషన్ ను నియమించాలని, రాష్ట్రంలో రిజర్వేషన్లు విభజించేందుకు ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేయాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న దళితులకు 25శాతం రిజర్వేషన్లను అమలు చెయ్యాలి. పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న మందక్రిష్ణ ఈ రాష్ట్రంలో అమలు కావాలంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో 25శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా 25శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి. మంద కృష్ణ మాదిగ దళితుల అభివృద్ధిని ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాడో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

మాదాసి కురువను అనుమతించవద్దు..
ఏబీసీ వర్గీకరణలో మాదాసి కురువను అనుమతించవద్దని.. మాల మహానాడుకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేశారు. వినతులు స్వీకరించే వద్ద వారికి టోకెన్లు ఇవ్వవద్దని నిరసనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


బుడగజంగాలను ఎస్సీలో చేర్చాలి..
2008కి పూర్వం ఎస్సీలుగా ఉన్న బుడగ జంగాలను తిరిగి ఎస్సీలుగా గుర్తించాలని బుడగ జంగం రాష్ట్ర నాయకులు మనోహర్ డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. బుడగ జంగాలు పడుతున్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement