గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు రూరల్ మండలం బుడంపాడు ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కారు కింద పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు.
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన కొండపోగు అంకంరావుగా గుర్తించారు. కాగా మృతదేహాన్ని రుద్రా ట్రస్ట్ ద్వారా జీజీహెచ్ కు తరలించారు.
- Advertisement -