ఆయోధ్య – రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు. ..
ఆన్లైన్లో బుకింగ్
అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
లాగిన్ చేయడానికి మీ మొబైల్ నంబర్ని ఉపయోగించండి.
మీ మొబైల్‌కి పంపిన OTP తో మీ ఐడీని ధృవీకరించండి.
‘మై ప్రొఫైల్’ విభాగంలో గుర్తించి, క్లిక్ చేయండి.
ఆరతి లేదా దర్శనం కోసం మీకు ఇష్టమైన స్లాట్‌ను ఎంచుకోండి.
అవసరమైన వివరాలను అందించండి.
మీ బుకింగ్‌ను పూర్తి చేయడానికి, పాస్‌ను పొందేందుకు ప్రాంప్ట్‌లను అనుసరించండి.
బుకింగ్ విజయవంతమైన తర్వాత నిర్ధారణను స్వీకరించండి.
ఆలయంలో ప్రవేశానికి ముందు ఆలయ కౌంటర్ నుండి మీ పాస్‌ను తీసుకోవాలి.
రామ మందిరంలో ఆరతి చేసే సమయం ఎంత?
రామాలయంలో రాంలాలా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు. మొదటిది – ఉదయం 6:30 గంటలకు, దీనిని జాగ్రన్ లేదా శృంగార్ ఆర్తి అంటారు. రెండవది – మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతి అని.. మూడవది రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతి అని పిలుస్తారు.
ఆరతిలో 30 మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ..
అయోధ్యలోని రామ మందిరంలో ఆరతికి హాజరు కావడానికి శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి పాస్ తీసుకోవచ్చు. పాస్ కోసం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండటం అవసరం. ఆరతిలో ఒకేసారి 30 మంది మాత్రమే అవకాశం కల్పించనున్నారు.. అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం ఉచితం. రాంలాలా దర్శనం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరతి రోజుకు మూడు సార్లు జరుగుతుంది. దీని కోసం తప్పనిసరిగా పాస్ తీసుకోవాలి. పాస్ ఉన్న వారినే హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.