Thursday, November 21, 2024

రూటు మార్చిన బెట్టింగ్ నిర్వాహ‌కులు..

అమరావతి,ఆంధ్రప్రభ: ‘మీ పిల్లలు ఇంజనీ రింగ్‌/డిగ్రీ పూర్తి చేశారా? అబ్రాడ్‌ వెళ్లే ఉద్దేశం ఉం దా? ఉద్యోగం చేయాలనుకుంటే మేం శిక్షణ ఇచ్చి జాబ్‌ ఇప్పిస్తాము. ఆసక్తి ఉంటే ఈ నంబర్‌కు ఫోన్‌ చే యండీ’ గత నాలుగైదేళ్లుగా తల్లిదండ్రుల మొబైల్స్‌కు వస్తున్న ఫోన్‌ కాల్స్‌. ఇప్పుడు విద్యార్థులు, యువ తను లక్ష్యంగా చేసుకొని గ్యాంబ్లింగ్‌ నిర్వహకులు ఇదే తరహా విధానాలకు తెరతీశారు. డిస్‌ప్లే కాని ప్రైవేటు నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ఆసక్తి ఉందా? ఉంటే ఏయే గేములపై పందేలు కాస్తారు? ఐపీఎల్‌లో ఓవర్ల లెక్కన ఆడతారా? లేక బాల్స్‌ లెక్కనా? అంటూ ఆరా తీస్తున్నారు. ఇటు నుంచి వచ్చే సమాధానం ఆధారంగా బెట్టింగ్‌ లపై ఆసక్తి ఉన్నదీ? లేనిదీ? గుర్తించిన తర్వాత కొన్ని నంబర్ల నుంచి లింకులు పంపుతున్నారు. అది కూడా ఒకటికి రెండు సార్లు వీరి మాటల ద్వారా విశ్వసించిన తర్వాతనే. ఆ నంబర్ల ద్వారా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ కట్టొచ్చని చెపుతున్నారు.
గతంలో ఏజెంట్ల ద్వారా బెట్టింగ్‌ రాయుళ్లను ఆకర్షించిన గ్యాంబ్లింగ్‌ నిర్వహకులు..పోలీసు కళ్లు గప్పేందుకు ఇప్పుడీ కొత్త తరహా ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలో గ్యాంబ్లింగ్‌(జూద) నిర్వహకులు రూటు మార్చారు. పోలీసుల కళ్లు గప్పేందుకు కొత్త తరహా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు తెరతీశారు. జూదరులను పోలీ సులు పట్టుకున్నప్పటికీ అటు ఏజెంట్లు..ఇటు నిర్వహ కులు బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. వీరి మాటలకు ఆకర్షితులై అనేక మంది యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

గతంలో ఇలా..
గతంలో క్రికెట్‌ సహా వివిధ క్రీడల్లో జూద నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసు కునే వారు. అపార్టుమెంట్లు, ఇండి పెండెంట్‌ గృహాలను అద్దెకు తీసుకొని బెట్టింగ్‌ నిర్వహణకు ప్రత్యేక పరిక రాలు, కంప్యూటర్‌, టీవీ వంటివి ఏ ర్పాటు చేసుకునే వారు. వీరు ప్రాం తాల వారీగా కొందరు ఏజెంట్లను కమిషన్‌ పద్ద తిపై నియమించుకొని బెట్టింగ్‌లు నిర్వహించేవారు. జూద గాళ్లు (బెట్టింగ్‌ రాయుళ్లు) ముందు గానే ఏజెంట్ల వద్ద కొంత నగదు డిపా జిట్‌ చేసే బెట్టింగ్‌లు కట్టేవారు. టీవీల వద్ద మ్యాచ్‌లను, ఇతర క్రీడలను వీక్షిస్తూ ఎప్పటికప్పుడు తమ ఫోన్ల ద్వారా బెట్టింగ్‌ కట్టేవా రు. గెలిస్తే ఏజె ంట్లు వచ్చి వారికి డబ్బులు ఇచ్చేవా రు. ఒకవేళ ఓడిపోతే ముందు డిపాజిట్‌ చేసిన మొ త్తం పోను మిగిలిన మొత్తాన్ని ఆటగాళ్ల(ఫంటర్ల) నుంచి వసూలు చేసేవారు. నమ్మకస్తులైన జూదగాళ్లకు రూ.లక్షల్లో అప్పులు కూడా పెట్టేవారు. ఆపై వీరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటం..అనేక మంది అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.

మధ్యలో మరోలా..
రాను రాను పోలీసుల నిఘా, దాడులు పెరగ డంతో అందొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం బెట్టింగ్‌ నిర్వ హకులు వినియోగించుకున్నారు. ఏజెంట్లు ముందు గానే బెట్టింగ్‌ రాయుళ్లకు కొన్ని ఫోన్‌ నంబర్లు ఇచ్చి యూపీఐ ఆధారిత పేమెంట్లను తీసుకునేవారు. జూద రుల ద్వారా మినహా ఎక్కడా ఏజెంట్లు వెలుగులోకి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు చేతులు మారేవి. రోజు రోజుకూ పెరుగుతున్న బెట్టింగ్‌ సం స్కృతికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం..ఆడేవాళ్లను పట్టుకుంటే ఏజెంటు తద్వారా నిర్వహకులు పట్టుబడటం జరి గేది. దీంతో ఈ తరహా విధానం కూడా కొంతకాలంగా ఆగిపోయిందని చెప్పొచ్చు. ఈజీ మనీకి అలవాటు పడిన నిర్వహకులు ఏదోలా బెట్టింగ్‌ నిర్వహించేందు
కు సిద్ధమవుతారు తప్ప ఆగిపోవడం అనేది ఉండ దనేందుకు ఇటీవల వెలుగు చూస్తున్న కొత్త తరహా విధా నాలే కారణం.

ఇప్పుడిలా..
ప్రైవేటు మొబైల్‌ నంబర్ల నుంచి విద్యార్థులు, యువత లక్ష్యంగా చేసుకొని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందీ? ఎవరు చేశారు? అనేది వీరిలో ఏ ఒక్కరికీ తెలి యదు. బెట్టింగ్‌పై ఆసక్తి, అవ గాహన ఉన్న వారితో మాత్రమే వీరు సంభాషించి ఆకర్షిస్తు న్నట్లు చెపుతున్నారు. నిర్వ హకుల మాటలకు వీరు సరే నంటే ఆన్‌లైన్‌(వాట్సప్‌)లో లింకులు పంపుతున్నట్లు తెలిసింది.
ఆ లింకుల ద్వారా ఎప్పటికప్పుడు బెట్టింగ్‌లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మ్యాచ్‌, క్రీడకు ఒక్కొక్క లింక్‌ ఇస్తున్నట్లు తెలిసింది. వారిచ్చే లింక్‌లకు ఒక రోజు వరకు స్పందించకున్నా.. బెట్టిం గ్‌లు కంటిన్యూ చేయకున్నా ముందొచ్చిన లింక్‌లు డిలేట్‌ కావడంతో పాటు ఆ నంబర్లు కూడా ఆటో మేటిగ్గా డిలేట్‌ అవుతున్నట్లు కొందరు యువకులు చెపుతున్నారు. నిర్వహకులు, ఏజెంట్లు ఎవరో కూడా తెలుసుకోకుండా పకడ్బంధీ వ్యవహారంలో భాగం గానే ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పోలీసులు ఈ తరహా జూదానికి ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement