ముత్తుకూరు, డిసెంబర్ 24 (ఆంధ్రప్రభ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని మల్లూరు గ్రామంలో పాముకాటుతో వృద్ధుడు మరణించాడు. కుటుంబ సభ్యుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నీళ్ళ బాలకృష్ణయ్య(75) పాముకాటుతో మరణించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. నివాస గృహానికి సమీపంలో పశువులు ఉండగా, వాటి వద్దకు వెళ్తూ పాముకాటుకు గురయ్యాడు. మృతిచెందిన విషయాన్ని గ్రామ రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
- Advertisement -