Saturday, November 23, 2024

AP | రూ.300 కోట్లతో ఆయిల్‌ పామ్‌ కంపెనీ…

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సంజయ్‌ గోయెంకా, సంస్థ డైరెక్టర్‌ ఆశిష్‌ గోయెంకా ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. ఇటీవల ఏపీలో వరదలు బీభత్సం సృష్టించి నేపథ్యంలో, వరద బాధితుల సహాయార్థం వారు రూ.1 కోటి విరాళం తాలూకు చెక్‌ ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా తన ఎక్స్‌(ట్విట్టర్‌) ఖాతా ద్వారా వెల్లడించారు. 3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌ సంస్థ పామాయిల్‌ శుద్ధి రంగంలో అగ్రగామి కంపెనీగా ఉందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో గ్రీన్‌ ఫీల్డ్‌ సౌకర్యంతో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, తద్వారా రాష్ట్రంలో తమ వ్యాపార విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు తన ట్వీట్‌ లో వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement