విశాఖపట్నం : మంగళవారం ఉదయం కర్ణాటక స్టేట్ కి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకయ్య, ఐపిఎస్ కృష్ణమరాజు, ఐ.ఆర్.ఎస్ మహాదేవ్ లు, శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారి విక్రమ్ త్రిమూర్తులు పి ఆర్ ఓ నాయుడు స్వాగతం పలికారు.
వారు ముందుగా కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. తదుపరి బేడా మండపం ప్రదర్శన అనంతరం స్వామివారి అంతరాయ దర్శనం తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వీరితో శ్రీశైలం కృష్ణారావు మూర్తి రాజు, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
- Advertisement -