అధికారులు రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట రావొద్దని సీఎం జగన్ సూచించారు. దీన్ని అధికారులు సవాల్ గా తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేకుండా చేస్తున్నామన్నారు.
వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానం కావాలన్నారు. రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్ ను ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ఆర్బీకేల్లో ఉంచాలన్నారు.