Saturday, November 23, 2024

PRABHA EFFECT: విద్యార్థుల ప్రాణాలకే ముప్పు.. ఆంధ్రప్రభ కథనానికి స్పందన

నందికొట్కూరు (ప్రభన్యూస్): ప్రభుత్వ పాఠశాల సమీపంలో సాటు తయారీ కేంద్రంపై.. విద్యార్థుల ప్రాణాలకే ముప్పు అనే ఆంధ్రప్రభ కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఆదేశాల మేరకు సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి వేణుగోపాల్, ఎంఈఓ ఫైజూనిసా బేగంలు నందికొట్కూరు పట్టణంలో బిఎస్ఎస్ఆర్ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాలలను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలల పరిసరాలలను పరిశీలించారు. MEO ఫైజూనిసా బేగం, ఉపాధ్యాయులు ఇలియాస్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ సారా కంపు విద్యార్థుల ప్రణాలకే ముప్పు అని పత్రికలో కథనం వచ్చిందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ లు పత్రికలలో వచ్చిన కథనానికి విచారణ చేపట్టి నివేదిక పంపాలని ఆదేశించారన్నారు. అయితే పాఠశాలలకు సమీపంలో నాటు సారా కేంద్రాలు ఉండటం, వ్యర్ధాలు పడేయడం వాస్తవమేనని దీని వల్ల దుర్వాసన వస్తుందన్నారు. ఇక్కడ నాటు సారా తయారు చేయకుండా వుండదుకు ఆబ్కారీ శాఖ అధికారులకు, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే కాంపౌండ్ లేకపోవడంతో వృధా నీరంతా పాఠశాల వద్దకు చేరి దుర్వాసన వస్తుందన్నారు. పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నూతన అదనపు గదుల నిర్మాణం, ప్రహారి గోడ నిర్మాణానికి నాడు నేడు రెండవ విడతలో వీలైనంత త్వరగా నివేదిక పంపాలని MEOను ఆదేశించారు. అంతే కాకుండా మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడి దుర్వాసన వేదజల్లకుండా ఉండేందుకు, నీరు నిలువ లేకుండా ఉండేందుకు కాలువలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement