Saturday, November 23, 2024

ఆక్రమణల తొల‌గింపు.. షురూ చేసిన అధికారులు

పుట్టపర్తి; అనంత‌పురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రుద్ర భూమి ఆక్రమించుకుని ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు తొలగించారు. మంగళవారం ఉదయం తాసిల్దార్ భాస్కర్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ మురళి, దిశ డిఎస్పీ శ్రీనివాసులు, అర్బన్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు షురూ చేశారు. ఈ సందర్భంగా త‌హ‌సీల్దార్ మాట్లాడుతూ రుద్ర భూమి ఆక్రమించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో తద్వారా రుద్ర భూమి ఆక్రమణకు గురవుతుందని 2017లో పుట్టపర్తి నివాసి లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా లోకాయుక్త కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకున్న 42 షాపుల తో పాటు మున్సిపల్ శాఖ నిర్మించిన మరుగుదొడ్లను కూడా తొలగిస్తున్నామ‌న్నారు. 2.66 ఎకరాల భూమి ఆక్రమణకు గురికాకుండా మున్సిపాలిటీ నిధులతో ప్రహరీ గోడను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement