Tuesday, November 26, 2024

పోషక ఆహారం చిన్నారుల వృద్ధికి ఎంతో మేలు

గంపలగూడెం: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు,బాలింతలు,చిన్నారుల కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తుందని,వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పౌష్ఠికంగా, ఆరోగ్య వంతులుగా ఉండాలని ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి కోరారు. ఆమె గురువారం ఐసీడీస్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గంప‌ల‌గూడెం మండ‌లంలోని పెనుగోలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చిరు ధాన్యాల వంటల ప్రదర్శన శాలను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పోషణ స్థితిపై గర్భిణులు,బాలింతలు అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సీహెచ్ రేవతి అన్నారు పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు,గర్భిణులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు పిల్లలఎత్తు,బరువు చూసి వారి తల్లిదండ్రులకు పోషణ స్థితి వివరించారు ఆహారంలో పిండిపదార్థాలు,మాంసకృత్తులు, కొవ్వు ఉండే విధంగా చూడాలని ధాన్యాలు,ఆకు కూరలు, కూరగాయలు ఆహారంగా ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా చిరుధాన్యాలతో కూడిన వంటను తయారుచేసుకుని వచ్చిన వారికి బహుమతులు అందజేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement