Saturday, September 7, 2024

AP: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరం.. ప‌వ‌న్

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్‌ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు, రూ.2కే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయి” అని పవన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement