Thursday, November 21, 2024

Delhi: సినీ, రాజకీయ రంగాల్లో విశ్వవిఖ్యాతుడు ‘ఎన్టీఆర్’- రాష్ట్రపతి

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమన్నారు. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు.

భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని అన్నారు. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement