Thursday, November 7, 2024

NTR Dt I పటేల్ దార్శినికత నేటి యువతరానికి స్ఫూర్తి: పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ – ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో కంటే భారతదేశం ఐక్యతకు ప్రతి పని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. నాటి పటేల్ దార్శినికత నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమైక్యతా రన్ ను విజయవాడలో నిర్వహించారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా సమైక్యతా రన్ ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.దేశ సమైక్యతను సమగ్రతను చాటిచెప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, దేశ ఐక్యతా వాది భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సిటీ ఆర్మడ్ గ్రౌండ్స్ వరకు సమైక్యతా రన్ ను నిర్వహించారు.

బెంజ్ సర్కిల్ వద్ద నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. బెంజ్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ రన్ లో డి.సి.పి.లు గౌతమి షాలి, ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసద్, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు జాతీయ జెండాలను వివిధ రకాల ప్లకార్డ్ ద్వారా జాతీయ సమైక్యతను తెలియజేస్తూ సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్స్ వరకు ఈ రన్ సాగింది.

- Advertisement -

అనంతరం సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్స్ లో అందరితో కలిసి నగర పోలీస్ కమీషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అందరితో దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. అని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement