Friday, November 22, 2024

చంద్రబాబు విజన్‌ ఫలిస్తే ఏపీ నంబర్‌ వన్‌… సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్

అమరావతి, ఆంధ్రప్రభ: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ టీ-డీపీ అధినేత చంద్రబాబు 2047 విజన్‌ ఫలిస్తే దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌ అవుతుందని సినీ నటు-డు రజనీకాంత్‌ పేర్కో న్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో రజనీకాంత్‌ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తున్నదన్నారు. కానీ.. రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంద న్నారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసన్నారు. భారత రాజకీ యాలే కాదు, ప్రపంచ రాజకీయాలు ఆయనకు తెలుసని అన్నారు. .హైదరా బాద్‌ ను హై-టె-క్‌ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు. ఇటీ-వల చాలాకాలం తర్వాత హైదరా బాద్‌ను సందర్శించాననీ, తాను హైదరాబాద్‌లో ఉన్నానా.. లేక న్యూయార్క్‌లో ఉన్నానా అనిపించిం దన్నా రు తనకుచంద్రబాబుకు 30 ఏళ్లనుంచి ఫ్రెండ్షిప్వుంద న్నారు. ఆయనతో మాటలు తనకు ఎంతో జ్ఞానం పెంచాయన్నారు. ఈ సందర్భంగా తన సినీ జీవి తాన్ని రజనీ కాంత్‌ గుర్తు చేసుకున్నారు. .హీరోగా తన తొలి సినిమా పేరు రవిని గుర్తుచేశారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నా నని తెలిపారు. ఎన్టీఆర్‌ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టు-కుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్‌ క్రమ శిక్షణ పాటించేవారని కొనియాడారు. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్‌లా ఉండాలనుకున్నానని, ఆయనలా మేకప్‌ వేసుకుని ఫొటో దిగి తన స్నేహితుడికి చూపించానని గుర్తుచేశారు. తాను కోతిలా ఉన్నానని తన స్నేహి తుడు అన్నాడని ఈ సందర్భం గా రజనీకాంత్‌ చెప్పారు.

టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు యుగపురషుడని, సినీ రంగ చరిత్రలో, రాజకీయాల్లో ఆయనకు ఎవరు సాటిరా రని అన్నారు. విజయవాడ లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు భాగంగా ఆయన అసెంబ్లీ, చారిత్రాత్మక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం టిడి జనార్ధన్‌ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి చంద్రబాబు తో పాటు- సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్య క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భారతరత్న ఇవ్వా లని తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తామని, వచ్చేవరకు అడుగుతూనే ఉంటామని, అవసరమైతే పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు.. శక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్‌ ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటు-ందన్నారు. ఎన్టీఆర్‌ తనకు తానే సాటన్నారు. ఎన్టీఆర్‌ లాంటి నటు-డు, నాయకుడు రావాలంటే ఆయన మళ్లీ పుడితేనే సాధ్యమని పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పార్టీ స్థాపించారని, క్రమశిక్షణ గల నాయకుడిగా ఆచరించి చూపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.,

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆయన పార్టీ పెట్టారని తెలిపారు. దేశ రాజకీయాలపైనా ఎన్టీఆర్‌ తన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. పరిపాలన ఎలా ఉండాలి, బాధ్యత గల నాయకుడు ఉండాలనే వాటికి ఎన్టీఆర్‌ ఆదర్శం అన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో మెమోరి యల్‌ రూపొందేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించిన పార్టీ టీ-డీపేనని చంద్రబాబు పేర్కొన్నారు.రజనీకాంత్‌ను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రజనీ కాంత్‌ సినిమాలు ప్రపంచం మొత్తం చూస్తారని పేర్కొన్నారు. జపాన్‌ పర్యటనలో ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలు గురించి అక్కడి జపనీస్‌ తనతో చర్చించిన విషయాన్ని ఈ సందర్భం గా గుర్తు చేసుకున్నారు. మంచి మానవీయ విలువలు ఉన్న వ్యక్తి రజినీకాంత్‌ అని పేర్కొన్నారు.

ఈ సభలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్వరి, టిడి జనార్దన్‌, సీనియర్‌ పాత్రికేయులు వెంకట నారాయణ తదితరులు ప్రసంగించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొ న్నారు. తొలుత ఎన్టీఆర్‌ కుటు-ంబ సభ్యులు , ముఖ్య అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ చరిత్రాత్మక ప్రసంగాలపుస్తకాన్ని రజినీ కాంత్‌ ఆవిష్కరించగా, అసెంబ్లీ ప్రసంగాల సావనీర్‌ను నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సినీ, రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌పై ప్రముఖ జర్నలిస్టు వెంకట నారాయణ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement