కర్నాకటతో పాటు ఆ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నారాయణపూర్ జలాశయం నుంచి నీరు విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1.53 లక్షల క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీటిని విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలానికి వరద నీరు వస్తోంది.
Floods: ఇప్పుడు కృష్ణమ్మ వంతు.. పోటెత్తుతున్న వరద, జూరాలకు జలకళ
Advertisement
తాజా వార్తలు
Advertisement