Tuesday, November 26, 2024

AP | 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. దరఖాస్తు తేదీలివే !

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు ఉన్నాయి. టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్- 07 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్-04 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-01 పోస్టు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్-02 పోస్టులు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-01 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ కింద 19 పోస్టులు కేటాయిస్తూ ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది.

దరఖాస్తు వివరాలు..

  • కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
  • టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
  • మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
  • ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
  • వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
  • భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement