Wednesday, December 18, 2024

AP | రాష్ట్రంలో 53 బార్లకు నోటిఫికేషన్‌… 24న ఆన్‌లైన్‌ వేలం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సంవత్సర కాలపరిమితితో 53 బార్ల లైసెన్స్‌లు వేలం ద్వారా మంజూరు చేయనున్నట్లు- మద్యనిషేద, అబ్కారీ శాఖ కమిషనర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53 బార్లకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. లైసెన్స్‌ ఫీజు, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, బిడ్‌ అమౌంట్‌ను చెల్లించడంలో విఫలమైన వారి బార్లను వేలం ద్వారా ఔత్సాహికులకు ఇవ్వనున్నామన్నారు. బార్ల కేటాయింపు పూర్తిగా ఈ-వేలం, ఆన్‌ లైన్‌ లాటరీ పద్దతిలో జరుగుతుందన్నారు.

బార్ల లైసెన్స్‌ల కొరకు అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు వారి పేర్లను నమోదు, రిజిస్ట్రేష్రన్‌ ఆన్‌ లైన్‌ ద్వారా చేసుకోవాలని కోరారు. 50వేల జనాభా వరకు రూ. 5లక్షలు, 50వేల పైబడి 5 లక్షల లోపు జనాభా వరకు రూ.7.5 లక్షలు, 5లక్షల జనాభా పైబడిన నగరాలకు రూ.10లక్షలు దరఖాస్తు రుసుము(నాన్‌ రిఫండబుల్‌) ఈ నెల 23వ తారీఖు లోపు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

ఈ నెల 24న ఆన్‌ లైన్‌ ప్రక్రియ ద్వారా హెచ్చు మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి సంబంధిత బార్‌ను కేటాయిస్తామన్నారు. ఇతర వివరాలకు వెబ్‌ సైట్‌ను లేదా 8074396416 నెంబర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చని నిశాంత్‌ కుమార్‌ ఆ ప్రకటనలో సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement