Wednesday, December 18, 2024

AP | మెడికల్‌ పీజీ ఫేజ్‌-2 కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ : మెడికల్‌ పీజీ కోర్సులో రెండో విడత కౌన్సిలింగ్‌ కోసం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పీజీ మెడికల్‌ డిగ్రీ, డిప్లమో కోరసుల్లో సీక్యూ కోటాకింద చేరే నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులకు వెబ్‌ ఆప్షన్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం, తిరుపతి స్విమ్స్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌, మైనార్టీ, మైనార్టీయేతర మెడికల్‌ కళాశాలల్లో ఖాళీలను నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు షెడ్యూల్‌ వడుదల చేశారు.

నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఈనెల 16 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ రాత్రి 8 గంటల వరకు వెబ్‌ ఆప్షన్స్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.

విద్యార్థులు ఆప్షన్‌ ఎంచుకునేముందు వెబ్‌సైట్‌లో ఈ ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం ఆఫీసు పనివేళల్లో 8978780501, 7997710168, 9391805238 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement