ఏఎన్‌యూ క్యాంపస్, ప్రభన్యూస్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 175 శాశ్వత అధ్యాపక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటిల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 91, అసోసియేట్ ప్రొఫెసర్లు 57, ప్రొఫెసర్లు 26 కాగా, బ్యాక్లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక పోస్టు ఉన్నాయి. ఆర్ట్స్ , సైన్స్ కళాశాలలోని కొన్ని విభాగాల్లో ఉద్యోగాలు సంఖ్య తగ్గగా, సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలైన ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీలో భారీగా ఉద్యోగాలు ప్రకటించారు.
ఇంజనీరింగ్ కళాశాలలోని ఒక్కొక్క బ్రాంచిలో 6 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెండు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక్కొక్క ప్రొఫెసర్ చొప్పున ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ కళాశాలలో విద్యార్థుల ఆదరణ బాగా తగ్గిన సివిల్, మెకానికల్, త్రిబుల్‌ఈ బ్రాంచీల్లో కూడా భారీగా ఉద్యోగాలు ప్రకటించడం విమర్శలకు దారితీస్తోంది.
అలాగే ఫార్మసీలో 10 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మూడు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ ,ఆర్కిటెక్చర్ లో ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్, రెండు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 20 లోపు ఆ్లనన్లో దరఖాస్తు చేయాలి. అనంతరం దరఖాస్తుకు విద్యార్హతల సర్టిఫికెట్లను చేత చేసి నవంబర్ 27లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటు-ంది.