Tuesday, November 26, 2024

రైతుల‌పై రాళ్లు కాదు.. పువ్వులు : సుంక‌ర ప‌ద్మ‌శ్రీ

న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి దగ్గర ఉన్న శివాలయంలో మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించిన మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ కు పరమేశ్వరుడు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్రను ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. రైతుల పాదయాత్రపై రాళ్లు రువ్వుతారని సజ్జల అన్నారు.. రాళ్లు వేయడం కాదు.. ప్రజలు పూలతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉందని, పోలీసులు అక్రమ కేసులు బనాయించినా, అవమానాలు ఎదురైనా రాష్ట్ర భవిష్యత్ కోసం బరిస్తామని తెలిపారు. రైతుల త్యాగాలు వృధా కారాదని, మహా పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిపించాలని శివయ్యను కోరుకున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, రాజదాని రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement