తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడిని కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును సీఎం చేశాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ప్రజలకు శాంతి, సంక్షేమ పాలన అందుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే రౌడీషీట్లు తెరుస్తున్నారని, ఈ తీరు సరికాదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ చేసిన విమర్శలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు కౌంటరిచ్చారు. శవ రాజకీయాలు చేసేది YCP వాళ్లేనని చెప్పారు. తాడిపీత్రికి వచ్చి తనపై విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చనిపోయిన పాప తండ్రి వికలాంగుడని ఆయన గుర్తు చేశారు. పాప తండ్రికి పెన్షన్ ఇప్పించాలని మంత్రిని కోరాడు అలా పెన్షన్ ఇప్పిస్తే నీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. గతంలో ఏ పార్టీలో ఉన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రిని కోరారు.
Breaking: చంద్రబాబును సీఎం చేశాక రాజకీయాల నుంచి తప్పుకుంటా : జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement