Thursday, November 21, 2024

AP | ఆరోపణలు కాదు.. చర్యలెప్పుడు తీసుకుంటారో చెప్పాలి: చంద్రబాబు

కుప్పం (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఆరోపణలు చేయడం కాదు.. చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పండి” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడురోజుల పర్యటన నిమిత్తం ఆయన బుధవారం రాత్రి కుప్పం చేరుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్నారు.

జగన్​ అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదని, చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. కుప్పంలో గ్రానైట్ దోపిడీ చేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా… ఖబడ్దార్ అని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారన్నారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement