Monday, November 25, 2024

Nomination – ఎపిలో నామినేష‌న్ల ప‌ర్వానికి తెర‌

చివ‌రి రోజున నామినేష‌న్ల వెల్లువ‌
జ‌గ‌న్, భాష్యం, ప‌రిటాల‌, ద‌స్త‌గిరి,
కొండ‌య్యల‌తో స‌హా ప‌లువురు నామినేష‌న్ లు దాఖ‌లు
లోక్ స‌భకు 700, అసెంబ్లీ 4500 పైగా నామినేష‌న్లు

అమ‌రావ‌తి – ఏపీ నామినేష‌న్ల పర్వానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. చివ‌రి రోజు నామినేష‌న్లు వెల్లువెత్తాయి.. ఆయా నియోక‌వ‌ర్గాల రిట‌ర్నింగ్ అధికారుల కార్యాల‌యాలు నామినేష‌న్ వేసే అభ్య‌ర్ధుల‌తో కిట‌కిటలాడాయి.. ఆంధ్రప్రదేశ్‌లో చివ‌రి రోజున సీఎం జ‌గ‌న్ పులివెందుల అసెంబ్లీ స్థానంలో త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు..ఇక.. కాంగ్రెస్ అభ్య‌ర్ధులు అటు అసెంబ్లీకి, ఇటు లోక్ స‌భ స్థానాల‌కు నామినేష‌న్లు వేశారు.. పెద‌కూర‌పాడు నుంచి భాష్యం ప్ర‌వీణ్, రాప్తాడులో ప‌రిటాల సునీత , పులివెందులలో జైభీమ్ పార్టీ అభ్యర్ధిగా వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి, చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య నామినేష‌న్ వేసిన వారిలో ఉన్నారు..

ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు పెద్ద ఎత్త‌న దాఖ‌ల‌య్యాయి. బుధవారం ఒక్కరోజే లోక్‌స‌భ స్థానాలకు 203మంది, అసెంబ్లీ స్థానాలకు 1123 మంది నామినేషన్లు దాఖలు చేయ‌గా, గురువారం ఏకంగా లోక్‌స‌భ‌కు 700కు పైగా నామినేష‌న్లు వ‌చ్చాయి. అసెంబ్లీకి ఆ సంఖ్య ఏకంగా రెండు వేలు దాటింది..మొత్తం మీద 15 ఎంపీ స్థానాలకు 1100మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు సుమారు 4500 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వ‌చ్చారు. నామినేషన్ల దాఖ‌లు ప్రక్రియ ముగియడంతో.. రేపు పరిశీలన జరుగుతుంది.

- Advertisement -

ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల నియామ‌కం ..

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ, శాంతి భద్రతల, వ్యయ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు, శాంతిభద్రతల పరిశీలకులుగా ఐపీఎస్‌ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌, ఐటీకి చెందిన అధికారులను నియ‌మించింది. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి, రాజకీయ పార్టీల ఫిర్యాదులను స్వీకరిస్తారు.

పోలింగ్‌ కేంద్రాలకు మే 12న కూడా సెలవు

రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12, 13న, జూన్‌ 4న సెలవుదినాలుగా ఈసీ ప్రకటించింది. పోలింగ్‌ ఏర్పాట్ల కోసం ఆయా విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలకు ముందురోజు కూడా సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో మే 12న సెలవు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement