Sunday, September 22, 2024

AP | క‌ష్ట‌ప‌డ్డ వారికే నామినేటెడ్ పోస్టులు : సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, గ్రామస్థాయి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్య‌క‌ర్త‌లకు ఇచ్చే ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.

ఇక‌ త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, మహాకూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడి పనిచేసిన నేతలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు స్వతహాగా ఎదిగేలా ఎంపవర్మెంట్ చేస్తామ‌ని చంద్రబాబు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని.. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని వివరించారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని నేతలకు సూచించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం తప్పులు సరిదిద్దుతూ.. వ్యవస్థలను చక్కబెతున్నట్లు చంద్రబాబు చెప్పారు.గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, దోషులను వదిలిపెట్టమని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement