Friday, November 22, 2024

మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

రానున్న వేసవిలో కర్నూలు నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని, హాఫిజ్ ఖాన్ లు పేర్కొన్నారు. శనివారం మునగాలపాడు పంపింగ్ స్టేషన్ నందు అమృత్ స్కీం కింద సుంకేసుల జలాశయం నుంచి మునగాలపాడు పంపింగ్ స్టేషన్ వరకు 82 కోట్లతో నిర్మించనున్న పైప్ లైన్ నిర్మాణానికి మేయర్, ఎమ్మెల్యేలు  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చుటకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది జూన్ 7న ఈ పైప్ లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో 14.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5.66 కోట్లు నిధులు కేటాయిస్తారని, మిగతా 62.02 కోట్లు నగర పాలక సంస్థ నిధులతో పూర్తి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement