Friday, November 22, 2024

భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా-మూడు షిప్టుల్లో 1,189క్షుర‌కులు

భ‌క్తుల‌కి స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189 మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు ఉండడం విశేషం. రెండేళ్ల త‌రువాత ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని టీటీడీ అంచ‌నా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ క్షురకులు 337 మంది కాగా వీరిలో 336 మంది పురుషులు, ఒక‌ మహిళ ఉన్నారు. మొత్తం పీస్ రేటు క్షుర‌కులు 852 మంది కాగా వీరిలో 639 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1189 మంది క్షుర‌కులు, ముగ్గురు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు అసిస్టెంట్‌ లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, 46 మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్టుల ద్వారా విధులు నిర్వహి స్తున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement