ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవిడ్ వార్డులోని బాధితులు ఆందోళనకు గురయిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలోని కోవిడ్ రోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చొరవతో విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారు. విద్యుత్ ప్రవాహం లేకపోవడంతో సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే నిమ్మల ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని జనరేటర్‌కు నిమ్మల మరమ్మతులు చేయించడంతో.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో రోగులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కోవిడ్ రోగుల పట్ల నిర్లక్షం వహిస్తే సహించనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: పదోతరగతి విద్యార్థులందరు పాస్: తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ