Thursday, November 21, 2024

12ఏళ్లు దాటిన వాహ‌నాల‌కి.. తిరుమ‌ల ఘాట్ రోడ్డుపైకి నో ప‌ర్మిష‌న్

టిటిడి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 12ఏళ్లు దాటిన వాహ‌నాల‌ను తిరుమ‌ల ఘాట్ రోడ్డుపైకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. కాగా తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 24న 28వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఈ నెల 29న తిరుమల ఘాట్ రోడ్డు ఆరో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు గాయపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఘాట్ రోడ్డులో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు, విభాగాలతో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసింది టీటీడీ.మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ , వేగంగా వాహనాలు నడపడం, నిద్రలేమి , ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డులో ఫిట్ నెస్ లేని వాహనాలు ప్రమాదాలకు కారణంగా మారుతన్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement