Saturday, November 23, 2024

‘చలో సీఎంవో’: విజయవాడలో 144 సెక్షన్

సీపీఎస్ రద్దుపై గతంలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న డిమాండ్ తో యూటీఎప్‌ తలపెట్టిన ‘చలో సీఎంవో’కు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు. రేపు చలో సీఎంవో కార్యక్రమంలో ఉద్యోగులెవరూ పాల్గొనొద్దని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలో పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉంటుందని తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రేపు చలో సీఎంవోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  పోలీసులు అడ్డుకున్నా చలో సీఎంవో కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్‌ నాయకులు చెబుతున్నారు.  ఛలో సీఎంవో కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని అంటున్నారు. మరోవైపు ఛలో సీఎంవోకు వెళుతున్న యూటీఎఫ్ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ గృహనిర్బంధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement