నందికొట్కూరు, (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో పేపర్ లీకేజీ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా తప్పుడు ప్రచారమేనన్నా ఎస్పీ రఘువీరా రెడ్డి. నందికొట్కూరులో పదో తరగతి పరీక్ష పత్రం లీకైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నందికొట్కూరు గాంధీ మెమోరియల్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. పరీక్ష పత్రం లీకైందనే విషయంపై ఎంక్వైరీ చేశామని, ఇది నిజమని తేలితే, నిందితులను పట్టుకుంటామన్నారు. అయితే.. నందికొట్కూరు లో జరిగిందా, లేక వేరే ఎక్కడైనా జరిగిందా అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.