అమరావతి, ఆంధ్రప్రభ: వంటకాల్లో తప్పకవాడే ఉల్లి పెరిగిన ధరలతో ఒక సమయంలో ఢిల్లీ పీఠాన్నే కదిలించింది. సాధారణం గా ఆకాశాన్నంటే ధరలతో వినియోగ దారులను కంట తడి తెప్పించే ఉల్లి ప్రస్తుతం పాతాళానికి పతనమైన ధరలతో సాగు దారుల కంట కన్నీరు ఒలికిస్తోంది. గతేడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశ వ్యాప్తంగా పంట దెబ్బతిని ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో దిగుబడులు పెరిగి ధరలు అమాంతం పడిపోయాయి. ఈ పంటపై ఆధారపడ్డ రైతులు, వ్యాపారులకు ఇప్పుడు కష్టం వచ్చింది. ప్రస్తుతం ధరలు కుప్పకూలి గిట్టు- బాటు- ధరలు లేక రైతులు చేస్తున్న ఆందోళనలు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యం లోనే ఉల్లి సాగు రైతుల ఉద్యమ సెగ ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశాలు వున్నట్లు- తెలుస్తోంది. ఏపీలో రాయలసీమ ప్రాంతంలో ఉల్లి సాగు అధికంగా సాగవు తోంది. ప్రధానంగా కర్నూలు మార్కెట్ యార్డులో కిలోకు రూ.4 కు మించి ధరలు పలకక పోవడంతో రైతులు ఆందోళన చేయడం జరిగింది
గిట్టబాటు- ధరలు లేక రైతులు ఉల్లిపాయలను మార్కెట్ యార్డుకు తీసుక రావడంలేదు. సాధారణంగా ఈ సీజనులో రోజుకు 25 నుంచి 30 లారీల సరుకు రావాల్సి వుండగా పడిపోయిన ధరలతో ఖర్చులు కూడా రావనే అనుమానంతో యార్డుకు సరుకులు తీసుకు రావడం లేదు. దీంతో ప్రస్తుతం యార్డుకు కేవలం 10 నుంచి 15 లారీల సరుకులు మాత్రమే వస్తున్నట్లు- చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లికి 2020లో మద్దతు ధర క్వింటా రూ.770 ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయడంలేదు. దీనితో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.400కు పతనమైంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లి ధర 20 రోజుల వ్యవధిలో సగానికి సగం పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచిన మహారాష్ట్ర లాసల్గావ్, నాసిక్ మార్కెట్‌లలో ఫిబ్రవరి 9వరకు క్వింటాలు ఉల్లి ధర రూ.1000 నుంచి రూ.1100 మధ్య పలకగా, ఈ నెల 27న అది సగటు-న రూ.500 నుంచి రూ.550కి పడిపోయింది. ఒక దశలో కిలో ఉల్లి ధర రూ.4 నుంచి రూ.2కు కూడా పడిపోయింది. ఒక్కసారిగా పడిపోయిన ధరల ప్రభావంతో ఇక్కడి ఉల్లి వ్యాపారులు లబోదిబో అంటు-న్నారు. దీంతో లాసల్గావ్ మార్కెట్లో తమ వ్యాపారాలను బలవంతంగా నిలిపివేశారు. ఇతర మార్కెట్లలో కూడా ఉల్లి వేలం ప్రక్రియను నిలిపివేస్తామని మహారాష్ట్ర ఉల్లి పెంపకందారుల సంఘం తెలిపింది.
మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం:
మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిపోవడానికి కారణాలు అనేకం. ఇందులో ముఖ్యమైనది వాతావరణంలో వచ్చే మార్పులు. సాధారణంగా అక్కడ రైతులు ఉల్లికి సంబంధించి ఏడాదిలో 3 పంటలు పండిస్తారు. ఖరీప్లnో జూన్-జులై మధ్యలో పంట నాట్లు- వేసి, సెప్టెంబర్, అక్టోబర్‌లో కోతలు జరుపుతారు. ఖరీఫ్ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నాట్లు- వేసి, జనవరి, ఫిబ్రవరిలో.. రబీ సీజన్‌కు సంబంధించి డిసెంబర్ లేదా జనవరిలో నాట్లు- వేసి, మార్చి, ఏప్రిల్లో కోతలు చేపడతారు. పండించిన పంటను ఒకే సారి విక్రయించరు. ఎక్కువగా నగదుకే విక్రయిస్తారు.
ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దిగజారిన ఉల్లి వ్యాపారులకు మాత్రమే కాదు, రైతులకు కూడా కన్నీళ్లు మిగులుస్తోంది. మార్కెట్లో నిల్వలు పెరిగి, ధరలు భారీగా తగ్గిపోవడంతో వ్యాపారులు రైతులకు కూడా తక్కువ ధరలే చెల్లిస్తున్నారు. ఇటీ-వల షోలాపూర్లో ఓ రైతు 512 కేజీల ఉల్లిని మార్కెటు-్క విక్రయం కోసం తీసుకురాగా, అన్ని ఖర్చులూ పోనూ వ్యాపారి రైతుకు కేవలం 2రూపాయల చెక్కు చేతిలో పెట్టాడు. ఇలాంటి అనుభవాలు అనేక మంది రైతులకు ఎదురవుతున్నాయి. రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకుంటు-న్న దళారులు, వ్యాపారులు ధరలను మరింత తగ్గించి నామమాత్రం మొత్తాన్ని రైతు చేతిలో పెడుతున్నారు. రైతులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధను దిగమింగుకుంటూ వ్యాపారులు ఇచ్చిన మొత్తాన్ని తీసుకుంటు-న్నారు. భారతదేశంలో ఉల్లి ధరలు రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలను కూడా పడగొట్టే స్థాయి ఉల్లిది. 1998లో దేశ రాజధాని దిల్లీలో ఉల్లి ధరల పెరుగుదలతో అప్పడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. దిల్లీలో బీజేపీకి అప్పుడు చేజారిన అధికారం మళ్లీ ఇంకా దక్కలేదు. ఇక ఉల్లి పంట అధికంగా పండే మహారాష్ట్రలోనూ పలు మార్లు ఉల్లి ధరలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ధరలు తగ్గినా, పెరిగినా, అది పాలక పక్షాలకు ఇబ్బందిగా, విపక్షాలకు అస్త్రంగా మారుతూ వస్తోంది. తాజాగా ఉల్లి ధరల తగ్గుదల అంశం మహారాష్ట్ర శాసనసభను కుదిపివేసింది. ఉల్లి రైతుల సమస్యలను తెలిపేందుకు ఎన్సీపీ-ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలకు ఉల్లిపాయ బుట్టలతో హాజరయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధరలు తగ్గిన నేపథ్యంలో అక్కడి హోల్సేల్ వ్యాపారులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.1000 కచ్చితమైన ధర ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ ధరకు తక్కువగా ఎవరూ కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నాఫెడ్ కూడా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీనిపై నాఫెడ్ కూడా స్పందించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పుడే చర్యలు చేపట్టాలి. నాఫెడ్ కొనుగోలు చేసే రబీ ఉల్లి పంట నుంచి బఫర్ స్టాక్‌ను ఏర్పాటు- చేయాలి. గిట్టు-బాటు- ధరను నిర్ణయించి రైతుకు, వ్యాపారులకు తగిన లాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తగిన నిల్వ సౌకర్యాలను ఏర్పాటు- చేయాలి. లేకుంటే ఇప్పుడు మహారాష్ట్రకే పరిమితమైన ఉల్లి సంక్షోభం, రాబోయే రోజుల్లో ఎపీలో రైతులు, వ్యాపారులకు, వినియోగదారులకు కన్నీరు తెప్పించే ప్రమాదం ఉంది. గతంలో ఇదే పరిస్తితి ఎదురైనపుడు ఎపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ను రంగంలోకి దింపి రైతుల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియగదారులకు విక్రయించడం జరిగింది. ఇదే రీతిలో ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాలని ఉల్లి సాగుదారులు కోరుతున్నారు.