Friday, November 22, 2024

బాల్య వివాహాలకు ఇక చెక్‌.. సర్టిఫికెట్‌ ఉంటేనే పెళ్ళిళ్ళు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఇక రాష్ట్రంలో బాల్య వివాహాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. ఈమేరకు పక్కాగా అమలు చేసేందుకు నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వివాహాలు చేసుకోగోరేవారికి వయస్సు ధృవీకరణ పత్రం ప్రామాణికంగా చేయడం ద్వారా మైనర్‌ల పెళ్ళిళ్ళకు అడ్డుకట్ట వేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదించడం ద్వారా ప్రత్యేక ఉత్తర్వుల జారీ కోసం కృషి చేస్తోంది. ఈ నిబంధనన తప్పనిసరి చేసేందుకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఇటీవల నిర్వహించిన బోర్డు మీటింగ్‌ రాష్ట్రంలోని బాల్య వివాహాల నియం త్రణకు సిద్ధం చేసిన ప్రణాళికకు ఆమోదం తెలిపింది. కమిషన్‌ నిర్ణయాలను ప్రభుత్వం ముందుంచి ఉత్తర్వులు జారీ చేయించేందుకు ఫైలు సీఎం పేషీకి చేరినట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి జిల్లాలోనూ బాల్య వివాహాల నిరోధక అధికారులతో జిల్లా కలెక్టర్‌ సారధ్యంలో సమీక్ష నిర్వహించనుంది. తద్వారా జిల్లాలోని క్షేత్ర స్ధాయిలోని పరిస్ధితులను అంచనా వేయడంతోపాటు తీసుకోనున్న చర్యలను ప్ర జలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కమిషన్‌ ఆదేశించింది. అదేవిధంగా జిల్లాల వారీగా టాస్‌ ్కఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు మైనర్‌ల వివాహాలను నిరోధించడంలో ఇక నుంచి కీలకంగా పని చేయనున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే నష్టాలు, సమస్యలను తెలియచెప్పే విధంగా అవగాహన కలుగచేస్తూ విద్యకు దగ్గర చేసేలా చర్యలు చేపట్టనుంది. చదువు వైపు మళ్లించడం ద్వారా చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేయడం, చేసుకోవడం, ప్రోత్సహించడం వంటి పరిసి ్ధతులను దూరం చేయవచ్చని, నిబంధనలు విస్మరించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలుండేలా క్షేత్ర స్ధాయిలో అధికారులు యాక్షన్‌ షురూ చేయనున్నాయి.

దీనిలో భాగంగా బాల్య వివాహాలు నియంత్రణ కోసం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోని పంచాయతీ సెక్రటరీలను కమిషన్‌ రంగంలోకి దింపనుంది. పెళి ్ళళ్ళు చేసుకోవాలనుకునే వారు ముందుగా వయస్సు నిర్దారణ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం పంచాయితీ సెక్రటరిని సంప్రదించడం ద్వారా ఆయన సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. దీంతో ధృవీకరణ తరువాత మాత్రమే వివాహానికి అనుమతి తీసుకోవాలనే నిబంధన ఇకపై అమల్లోకి రానుంది. దీంతో తప్పని సరిగా ఫంక్షన్‌ హాల్‌, కళ్యాణ మండపం, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇతర పెళ్ళి వేదికల వద్ద కనీస వివాహ వయస్సు దుృవపరిచే పత్రాలు సమర్పిస్తేనే అక్కడ వివాహాలు చేసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ విధంగా ఆయాచోట్ల సంబంధిత అధికారులు, యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆయా చోట్ల ఇందుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలన్న నిబంధన తప్పనిసరి కానుంది. నిరంతరం వీటి పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనున్నాయి. బాలల హక్కుల కమిషన్‌ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన నాటి నుంచే విస్మరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాట ు కానుంది. ఈ విభాగం సిఫార్సు, ఫిర్యాదులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ చేయడం జరుగుతుంది. కాగా బాల్య వి వాహాలు ఎక్కువగా జరిగే వెనుకబడిన జిల్లాలు, విద్య అందుబాటులో లేని ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు తదితర చోట్ల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మరింత దృష్టి కేంద్రీకరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement