విజయనగరం, (ప్రభన్యూస్): పాలకుల అచేతనత్వం..అధికారుల నిర్లక్ష్యం..వెరసి తమ చదువులు గత ఏడాది కరోనా ఖాతాలో జమైపోయాయని వాపోతున్న కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఈ ఏడాదీ క్లిష్టంగానే గడుస్తోంది. ఆన్లైన్ చదువుల సంగతి పక్కన బెడితే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ బోధకులు లేక అవస్థలు పడుతున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా కుచ్..కరోనా అంటూ గగ్గోలు పెడుతున్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి గెస్ట్ లెక్చరర్లను తొలగించేయడంతో కమ్యూనిటీ రిసోర్స్ టీచర్లే కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యార్థినులకు పెద్ద దిక్కయ్యారు.
విద్యా సంవత్సరంలో మరో 12 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన అధికారులు ఆమేరకు 23 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించారు. అప్పటివరకు పరవాలేదని అనుకున్నా 2020-21 విద్యా సంవత్సరం వచ్చేసరికి మిగతా 18 కేజీబీవీల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన అధికారులు అధ్యాపకుల నియామకాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా ఇంటర్మీడియట్కు బోధించాల్సిన 113 అధ్యాపక పోస్టులు అనివార్యంగా ఖాళీగా పడివున్నాయి. మొత్తం మీద విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కూడా గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే అచేతనత్వంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద కేజీబీవి ఇంటర్మీటియట్ వి ద్యార్థుల గోడు అమాత్యులకు పట్టకపోగా సమస్య తీవ్రత ఏమిటన్నది సర్కారుకు అర్ధంకాని పరిస్థితి నెలకొంది
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital