Friday, November 22, 2024

సీబీఐ ద‌ర్యాప్తును ఏ శ‌క్తి ఆప‌లేదు… జీవీఎల్

సీబీఐ వంటి సంస్థలు చేస్తున్న దర్యాప్తును ఏ శక్తి ఆపలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పారు. సీబీఐని చేతగాని సంస్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేసి అభాసుపాలు కావొద్దని సూచించారు. ఎటువంటి తాటాకు చప్పుళ్లకు సీబీఐ భయపడదని స్పష్టం చేశారు. రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం అంటే ప్రజా సంక్షేమం కోసమే తప్ప అనవసర నిందలు వేయడం సరైనది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే లాభాపేక్ష ఆశించి చేస్తున్నారని నిందలు వేయడం దారుణమన్నారు. స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత కంటే ఎక్కువ నిధులు వచ్చాయని ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement