Sunday, November 17, 2024

విజయవాడ – వంశీకి క్షమాభిక్ష కూడా లేదు…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో)హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వల్లభనేని వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్ట రీతిగా ప్రవర్తించడంతోపాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడి పార్టీ ఆఫీసునే తగలబెట్టిన చరిత్ర వంశీధన్నారు.

ఎన్నికలకు ముందు రజినీకాంత్ డైలాగులు చెప్పి తరువాత గజినీకాంత్ గా మారిన పరిస్థితి వంశీదన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం లోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ,గన్నవరం ఖాన్ దాదా అధికారం అడ్డం పెట్టుకొని చాలా ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తించాడు అతను ఎవరో తెలుసు కదా గన్నవరం వంశీ అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం మీద అనేక మాటలు మాట్లాడి టిడిపి ఆఫీసును కూడా తగలబెట్టాడన్నారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు వాగటం ఎందుకు ఎన్నికల అయిపోయిన వెంటనే పారిపోవటం ఎందుకు అని ప్రశ్నించారు. పరిటాల రవి అనుచరుడివని ప్రగల్ బాలు పలికిన వాడివి నివు ఆఖరికి పరిటాల రవి ఆస్తులు కూడా దోచుకున్నాడన్నారు.

- Advertisement -

ఇంటిలిజెన్స్ డిజిపి ఆంజనేయులు హని టైప్ చేసి ఇరిగించాడన్నారు. వంశీ కి కరెక్ట్ అనేది ఉందా నీకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి పరిటాల రవి దగ్గర నీ ఒక చెంచావన్నారు. పోలీసులు అరెస్ట్ చేయకుండానే సోషల్ మీడియాలో అరెస్టు చేశారని ప్రచారం చేయించుకున్న వంశీ, భయంతో పారిపోయాడన్నారు.

ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందని రజనీకాంత్ డైలాగులు చెప్పాడనీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చేసరికి గజినీకాంత్ మాటలు చెబుతూ ఉన్నాడన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీ అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడన్నారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడన్నారు. వంశీ సమాజంలో ఎక్కడైనా కనపడితే ప్రజలు పోలీసులకు అప్పచెప్పండనీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement