Thursday, November 21, 2024

ఉపాధి లేక.. ఊరిడిచిపోతున్నరు..

కర్నూలు, (ప్రభ న్యూస్‌) : పొట్ట కూటికోసం పశ్చిమ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు బయలుదేరి వెళ్తున్నారు. నిత్యం ఏదో ఒక మండలం నుండి కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల కోసం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టినా జిల్లాలో ఉపాది లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల వైపు ప్రయాణిస్తున్నారు. జిల్లాలోని ఆదోని డివిజన్‌లోని హొళగుంద, ఆలూరు, కోసిగి, మంత్రాలయం, ఆలూరు తదితర మండలాల్లో పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2021-22 సంవత్సరానికి ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులు రూ.23కోట్లు బకాయిలు ఉండగా, ఆదోని డివిజన్‌లో రూ.9.37కోట్లు బకాయిలు ఉన్నాయి. 5,85,755 జాబ్‌కార్డులు ఉండగా, ఉపాధి పనులకు వెళ్లే శ్రమశక్తి సంఘాలు 56వేల మంది ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా వలసలు ఊపందుకున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. వలస నివారణ కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. మరోవైపు ఈ పథకం ద్వారా పనులు చేసినా నగదు జమకాకపోవడంతో ఉపాధి కూలీలు ఉపవాసంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం పశ్చిమ ప్రాంతం వైపు ప్రత్యేక దృష్టి పెట్టి వలసల నివారణ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కూలీలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement