Monday, December 23, 2024

No Detention – అయిదు, ఎనిమిది త‌ర‌గతులు ఇక పాస్ కావాల్సిందే …. కేంద్రం

న్యూ ఢిల్లీ – కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలల్లో 5, 8వ తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షల్లో 5, 8వ తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోతే తదుపరి విద్యా సంవత్సరం కూడా మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది.

విద్యాహక్కు చట్టానికి 2019 మార్చిలో సవరణ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటికే దేశంలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8వ తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని తొలగించలేదు.
ఈ విషయాలను కూడా కేంద్ర సర్కారు ప్రస్తావించింది. కేంద్ర సర్కారు గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఇకపై కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలల్లో 5, 8వ తరగతుల విషయంలో పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోతే వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఉంటుంది. రెండు నెలల్లో వారికి తిరిగి పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలోనూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతే ఆయా విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాలి. ఇక పాఠశాల విద్య రాష్ట్రాల లిస్టులోని విషయం కాబట్టి ఈ స్కూళ్ల అంశాల్లో మాత్రం రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement