Friday, November 22, 2024

సింహాద్రి అప్పన్న ఆలయంపై కరోనా ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల భారీగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కర్ఫ్యూ విధించింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఆలయాల్లో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏపీ దేవాదాయ శాఖ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. విశాఖలోని వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో  ఆలయాన్ని మూసివేయాలని ఈఓ సూర్యకళ నిర్ణయించారు. అయితే, స్వామివారికి నిత్య పూజలు యధావిధిగా జరపాలని నిర్ణయించారు. భక్తులకు అనుమతిలేకపోయినా… స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరుగుతాయని ఈఓ తెలిపారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement