Thursday, November 21, 2024

కాకినాడ కార్పొరేషన్‌ లో టీడీపీకి షాక్‌: అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్‌

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ లో టీడీపీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై కౌన్సిల్ లో వైసీపీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మేయర్ పై అవిశ్వాసానికి అనుకూలంగా 36 ఓట్లు పడ్డాయి. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. దీంతో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌ పదవిని టీడీపీ పార్టీ కోల్పోయింది.

అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉండగా.. మరో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. మొదటి నంచి అనుకున్నట్లుగానే మేయర్ సుంకర పావని, మొదటి డిప్యూటీ మేయర్ సత్తిబాబు లను పదవుల నుంచి దించేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement