Saturday, November 23, 2024

ఆనందయ్య మందుపై నో క్లినికల్ ట్రయల్స్… మందు కొవిడ్ నివారణకు పనికొస్తుందా?

ఆయూష్ తరఫున ఆనందయ్య మందు తయారీ చేయబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మందు వినియోగంపై క్లినికల్ ట్రయల్స్ జరగలేదని, అందువల్ల ఆనందయ్య మందుతో ఎంత లాభం ఉంటుందో తెలియదని అన్నారు. మూడు రకాల ఆనందయ్య మందులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ మందులను ఆయుర్వేదంగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు. సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవొచ్చునని సింఘాల్ తెలిపారు. కరోనా బాధితులు ప్రభుత్వమందిస్తున్న రెగ్యూలర్ ట్రీట్ మెంట్ పొందుతూ సప్లమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోచ్చునన్నారు.

ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా క్యూలో కరోనా పేషెంట్లు నిల్చోవొద్దని, బంధువుల ద్వారా తెప్పించుకుని వాడుకోవాలని స్పష్టం చేశారు. పీ, ఎల్, ఎఫ్ రకాల ఆనందయ్య మందులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ మందును ఆయుర్వేదంగా గుర్తించడం లేదని,  సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకొవొచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఆనందయ్య మందుతో నష్టం లేదని నిపుణులు తెలిపారన్నారు. ఈ మందు కొవిడ్ నివారణకు పనికొస్తుందని చెప్పడానికి ఆధారాలు లభించలేదన్నారు. కరోనా నివారణకు రెగ్యూలర్ చికిత్ప పొందుతూనే సప్లిమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోవొచ్చునన్నారు. ఈ మందు పంపిణీ సందర్భంగా కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు క్యూలో నిలబడ కూడదని, వారివల్ల అదే క్యూలో ఉండే మిగిలిన వారికి కరోన సోకే ప్రమాదముందని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లు, హోం ఐసోలేషన్లలో ఉన్న వారు తమ బంధువులతో తెప్పించుకుని వినియోగించుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి చిన్నమ్మ.. రీ-ఎంట్రీకి శశికళ రెడీ!

Advertisement

తాజా వార్తలు

Advertisement