Saturday, November 2, 2024

AP | ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్ గ‌డువు పొడిగింపు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (ఎన్‌ఎంఎంఎస్) స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్‌ఎంఎంఎస్ 2024-25 స్కాలర్ షిప్‌ల కు సంబంధించిన‌ దరఖాస్తు గడువును మ‌రోసారి పొడిగించారు. ఈ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని తొలిత సెప్టెంబ‌ర్ 17గా నిర్ణ‌యించ‌గా, మళ్లీ గ‌డువును 2024 అక్టోబ‌ర్ 3 వరకు పొడిగించారు. తాజాగా నవంబర్ 15 వరకు గడువును పొడించారు.

ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు రూ.48 వేలు స్కాలర్ షిప్ అందజేస్తారు. డిసెంబ‌ర్ 8న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల‌ర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్‌సైట్ https://scholarships.gov.in/studentFAQs ద్వారా అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపింది.

- Advertisement -

అర్హులు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వ‌సతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3,50,000 లోపు ఉన్న విద్యార్థులు…. అలాగే ఏడో త‌ర‌గ‌తిలో 55 శాతం మార్కులు వ‌చ్చిన విద్యార్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు. రిజిస్ట్రేషన్ సమయంలో, విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలి.

పరీక్ష రుసుము ఓసీ, బీసీ విద్యార్దులకు రూ.100, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ. 50గా నిర్ణయించారు. పూర్తి వివరముల కోసం ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్‌సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గాని తెలుసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement