Saturday, November 23, 2024

సాధ్యాసాధ్యాలు పరిశీలించాక ఎన్‌ఐడబ్ల్యుఎస్ కొత్త కేంద్రాలు.. మోపిదేవి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సాధ్యాసాధ్యాలను పరిశీలించాక విశాఖలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ (NIWS) సంస్థ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలా, వద్దా అన్నది నిర్ణయిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విశాఖలో NIWS ఏర్పాటుపై వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ప్రశ్నకు కేంద్ర పర్యాటక మంత్రి జి. కిషన్ రెడ్డి బదులిచ్చారు. దక్షిణాదిలో ఆక్వా టూరిజం అభివృద్ధిలో భాగంగా విశాఖలో NIWS ఏర్పాటు చేస్తున్నారా అని మోపిదేవి ప్రశ్నించారు.

కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ పరిధిలో గోవాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఒక అటానమస్ సంస్థగా ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో డిమాండ్, వనరులు, ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ సంస్థ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలా, వద్దా అన్నది నిర్ణయిస్తుందని తెలిపారు. విశాఖలో బ్రాంచి ఏర్పాటు చేయాలన్నా గోవాలోని సంస్థ పరిశీలించి నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement